సేవ చేయడానికి లయన్స్ క్లబ్ ఒక చక్కని వేదిక.

Rathnakar Darshanala
సేవ చేయడానికి లయన్స్ క్లబ్ ఒక చక్కని వేదిక.
....కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

నేటివార్త రాయికల్ జూలై 29:

సేవ చేయడానికి లయన్స్ క్లబ్ ఒక చక్కని వేదిక అని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.

మంగళవారం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని మూటపెళ్లి గ్రామంలో  కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి వైద్య,ఉచిత షుగర్ నిర్ధారణ శిబిరం నిర్వహించారు.

శిబిరంలో 84 మందికి కంటి పరీక్షలు చేయగా 12 మందిని ఆపరేషన్ కోసం గుర్తించి రేకుర్తి కంటి హాస్పిటల్ కు వైద్యతో సహా తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

రాయికల్ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు పట్టణ తో పాటు మారుముల గ్రామాల్లో విస్తరిస్తున్నామన్నారు.

లయన్స్ క్లబ్ సుమారు 2893 మందికి కంటి ఆపరేషన్లతో పాటుగా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,మాజీ జడ్సీలు మ్యాకల రమేష్,
బత్తిని భూమయ్య, ప్రధాన కార్యదర్శి బొడ్గం అంజిరెడ్డి,
కోశాధికారి బెక్కం తిరుపతి, క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,

దాసరి గంగాధర్,కట్ల
నర్సయ్య,జిల్లాల సూర్యం రెడ్డి, సాంబారు శ్రీనివాస్,గ్రామీణ వైద్యులు రమేష్,గ్రామ నాయకులు మండ రమేష్, ఏలేటి రాజేందర్,అరె శ్రీనివాస్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Comments