సిఐ కుమారస్వామి సేవలు మరువలేనివి.
By
Rathnakar Darshanala
సిఐ కుమారస్వామి సేవలు మరువలేనివి.
నేటివార్త,జూలై 29,తాండూర్:
తాండూర్ సర్కిల్ సీఐగా విధులు నిర్వహించి బదిలీపై కాగజ్ నగర్ కు వెళ్లిన సీఐ కుమారస్వామికి ఎంపిడిఓ శ్రీనివాస్ అధ్యక్షతన తాండూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు,నాయకులు వీడ్కోలు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు.
వీడ్కోలు సన్మాన సభతో పాటు నూతనంగా తాండూర్ సిఐగా బెల్లంపల్లి నుంచి బదిలీపై వచ్చిన దేవయ్య కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఇరువురు సీఐలకు పూలమాలలు వేసి మెమొంటోలు అందజేసి పుష్పగుచ్చాలతో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ సిఐ కుమారస్వామి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి తన విధులు నిర్వహించిన కుమారస్వామి సేవలు మరువలేనివని అన్నారు.
క్రీడలతో యువతను చైతన్య పరిచే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడమే కాక నిత్యం గిరిజనులకు తమ అండదండలు అందించి వారి సమస్యలు పరిష్కరించడంలో ముందున్న బదిలీపై వెళ్లడం బధాకరమన్నారు.
బదిలిపై వెళ్లిన సర్కిల్ లో మంచి పేరు తెచ్చుకుంటూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం,
మాదారం ఎస్ఐ సౌజన్య,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండీ ఈసా,మాజీ ఎంపీపీ సిరంగి శంకర్,జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్రావు,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు,మాజీ జెడ్పిటిసి సాలిగామ బానయ్య,సీనియర్ నాయకులు దత్తుదొర, ఎలుక రామచందర్,పెర్క రాజన్న,పులగం తిరుపతి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments