అర్ధరాత్రి పెట్రోలింగ్ బలోపేతం,జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ.

Rathnakar Darshanala
అర్ధరాత్రి పెట్రోలింగ్ బలోపేతం,జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ.
నేటివార్త జగిత్యాల బ్యూరో, జూలై 25:


జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా పోలీసు అధికారి ఎస్పీ అశోక్ కుమార్  తెలిపారు. 

గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఎస్పీ స్వయంగా జగిత్యాల, కోరుట్ల పరిధిలో పెట్రోలింగ్ కార్యకలాపాలను తనిఖీ చేసి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాత్రి సమయాల్లో బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ, నైట్ బీట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ఇది ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడమే కాక, నేరాలను అడ్డుకునేందుకు కీలకమవుతుందని తెలిపారు.

అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై తనిఖీలు నిర్వహించి, వారి వేలిముద్రలను సేకరించి గత నేరచరిత్ర గల నిందితులతో సరిపోల్చుతున్నామని తెలిపారు.

 అలాగే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు జరిపి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలు, 

దొంగతనాల నివారణకు పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా జిల్లాలో ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్, ఎస్ఐ సుప్రియతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments