చౌటుప్పల్ మున్సిపాలిటీ లో నాగుల పంచమి వేడుకలు.

Rathnakar Darshanala
చౌటుప్పల్ మున్సిపాలిటీ లో నాగుల పంచమి వేడుకలు.
*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా    మహిళా భక్తులు పెద్ద    ఎత్తున నాగదేవతకి పంచామృతాభిషేకములు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా నాగదేవత విగ్రహ దాతలు దండ అరుణ్ కుమార్ హిమబిందు దంపతులు నాగదేవతకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమం వేద పండితులు శ్రీ పెద్ది కిషోర్ శర్మ గారి వేదమంత్రాలు చరణాల మధ్యన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్త గుర్రం వెంకటేష్ , వర్కాల వెన్నెల రవి గౌడ్ తూర్పాటి నరసింహ మరియు పెద్ద ఎత్తున మహిళ భక్తులు పాల్గొన్నారు 

చౌటుప్పల్ మున్సిపల్ పట్టణంలో, 18 వ వార్డులో ఈరోజు పైలాన్ పార్కులో నాగుల పంచమి సందర్భంగా, వార్డ్ మాజీ కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ గారు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నాగుల పంచమి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది,

ఇట్టి కార్యక్రమంలో, కావ్య వాణి శ్రీజ భవాని సబిత అనూష నిరూప కాసోజు సుజాత, , కాసోజు నవీన్ కుమార్, G. ఆంజనేయ చారి, పందుల ముత్యాలు, కాసోజు సాయి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
Comments