గోవా మద్యం పట్టి వేత.
By
Rathnakar Darshanala
గోవా మద్యం పట్టి వేత.
కారుతో పాటు 162 మద్యం బాటిళ్ల సీజ్.
నేటి వార్త సంగారెడ్డి.
సర్పంచి ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాత్రం ఇప్పటి నుంచి గ్రామస్థులను, ఓటర్లను కాకా పట్టక తప్పదు.
ఈ అలోచలను మదిలో పెట్టకొని కుటుంబ సభ్యులతో గోవాకు వెళ్లారు. అక్కడ గోవా అంతటా పర్యాటించారు.కారులో వెళ్లిన కుటుంబం పెద్ద అడిసెపల్లి నల్లగొండ జిల్లాకు బయలుదేరారు.
తిరుగు ప్రయాణం లో ఏకంగా 162 మద్యాం బాటిళ్లను తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేసుకొని కారులో నింపుకొని వస్తున్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న డిటిఫ్ ఎస్సై హన్మంతు సింబ్బంది కలిసి జహీరాబాద్ చీరాగ్‌పల్లి ఎక్సైజ్ చెక్‌పోస్టు తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న మద్యం విలువ రూ. 1.50 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు.మద్యాంతోపాటు కారును కూడ సీజ్ చేశారు.
112 పుల్ మద్యాం బాటిళ్లు ,50 బాటిళ్లు 330 ఎంఎల్ బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ లిక్కర్ కేసులో జయంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్టు చేయబడినట్లు ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం తెలిపారు .
ఈ దాడిలో డీటీఎప్ సంగారెడ్డి టీమ్, జీహీరాబాద్ ఎక్సైజ్ స్టేస్ టీమ్, జహీరాబాద్ చెక్‌పోస్టు టీమ్ పాల్గొన్నారు. గోవా మద్యం బాటిళ్లను పట్టు కున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, మెదక్ డిప్యూటి కమిషనర్ జె.హరి కిరణ్, ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్‌లు అభినందించారు.
Comments