భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మధుసూదన్ ఏసిపి చౌటుప్పల్.

Rathnakar Darshanala
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మధుసూదన్ ఏసిపి చౌటుప్పల్.

*మధుసూదన్ ఏ సి పి చౌటుప్పల్*

*నేటి వార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*

జిల్లాలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చౌటుప్పల్ మండల, టౌన్ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి అని చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ గారు తెలియజేశారు 

*ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు*

👉 చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు

👉 వాహనాలు వేగ పరిమితితో నడపాలి అతివేగం గా నడిపేటప్పుడు స్కిడ్ అయ్యి కింద పడే అవకాశాలు ఉంటాయి.

👉 కరెంటు స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్, ముట్టుకోవద్దు.

👉 ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లకండి

అత్యవసర సమయాలలో తప్ప బయటికి రాకూడదు.

జిల్లా పోలీసు శాఖ 24/7 ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయండి అని ప్రజలకు తెలియజేశారు
Comments