సహకార సంఘాల గోదాములలో ఎరువుల నిల్వలను తనిఖీ.డిసిఓ మనోజ్ కుమార్.

Rathnakar Darshanala
సహకార సంఘాల గోదాములలో ఎరువుల నిల్వలను తనిఖీ.డిసిఓ మనోజ్ కుమార్.
      ఎరువుల నిలుకలను పరిశీలిస్తున్న అధికారులు

పెగడపల్లి జూలై 25 నేటి వార్త దినపత్రిక జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ శుక్రవారం రోజున సందర్శించి ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డి సి ఓ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు.రైతులకు సరిపడా యూరియా సహకార సంఘాల గోదాములలో నిల్వ ఉందని అన్నారు.

రైతు పాసుబుక్ ఆధార్ కార్డు తీసుకొని ఒక ఎకరానికి ఒక వస్తా చొప్పున ఇవ్వాలని తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీకాంత్, సీఈవో గోపాల్ రెడ్డి, మధుకర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments