మంత్రి చేతుల మీదుగా బిటెక్ విద్యార్థి సుముక్‌కు ల్యాప్టాప్ అందజేత.
By
Rathnakar Darshanala
మంత్రి చేతుల మీదుగా బిటెక్ విద్యార్థి సుముక్‌కు ల్యాప్టాప్ అందజేత.
నేటి వార్త ధర్మపురి:
ధర్మపురి పట్టణానికి చెందిన బిటెక్ విద్యార్థి సందరికారి సుముక్కి ఎస్సీ కార్పొరేషన్ నుండి మంజూరు అయిన ల్యాప్టాప్ ను శుక్రవారం రోజున *రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు* ధర్మపురి పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు,నాయకులతో కలిసి సుముక్ కి అందజేసారు...
ఈ సందర్భంగా విద్యారంగంలో ముందడుగు వేస్తున్న ఎస్సీ విద్యార్థులకు అవసరమైన సాంకేతిక సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments