మలబార్ గోల్డ్ షోరూంలో అద్వితీయ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన.

Rathnakar Darshanala
మలబార్ గోల్డ్ షోరూంలో అద్వితీయ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన.
మేడ్చల్ జిల్లా, జూలై 26, (నేటి వార్త): 

ఏ.ఎస్.రావు నగర్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో అద్వితీయ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా నటి ఐశ్వర్య హాజరై బ్యూటీషియన్ భాగ్యలక్ష్మి, వినియోగదారులు కామాక్షి, ప్రవీణలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నటి ఐశ్వర్య మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో బంగారు నగలు, వజ్రాభరణాలు ఎంతో నాణ్యతతో తయారు చేసి తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. కళానైపుణ్యతతో, 

అంతులేని హుందాతనంతో కూడినవి, నగిషీ చెక్కిన ప్రతీ ఆభరణం కళాత్మతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాలను ప్రదర్శిస్తున్నామని మలబార్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

 ఈ అద్వితీయ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 06వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని, బంగారు ఆభరణాలు, 

రత్నాభరణాల తరుగు చార్జీలపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపు, వజ్రాల విలువపై 30 శాతం షరతులతో కూడిన తగ్గింపు ఆగస్టు 08 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ మనోజ్, స్టోర్ మేనేజర్లు మిథున్, భాస్కర్, జినేష్, హుస్సేన్, సంతోష్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments