ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ .కలెక్టర్ సత్యప్రసాద్.
By
Rathnakar Darshanala
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ .కలెక్టర్ సత్యప్రసాద్.
పెగడపల్లి జూలై 26 నేటి వార్త దినపత్రిక జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ జిల్లా వైద్యాధికారి ప్రమోద్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో గల ఫార్మసీని, ల్యాబ్ ,వార్డులను రికార్డులను పరిశీలించారు.
ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.వర్షాకాలం అయినందున ఆరోగ్యశాఖ ఉద్యోగులు అందరూ అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.
జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్ష చేయాలని , ఆరోగ్య కేంద్రం ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.ప్రజలకు జ్వరాలపైన పరిసరాల పరిశుభ్రత పైన అవగాహన కల్పిస్తూ డ్రై డే కార్యక్రమాలను ఎక్కువగా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నరేష్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments