నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన. రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్.

Rathnakar Darshanala
నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన. రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్.
అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే కృషి.

పది  సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది.



పెగడపల్లి జూలై 26 నేటి వార్త దినపత్రిక జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో గల రెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం రోజున నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి  లక్ష్మణ్ కుమార్,

 జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మండలానికి మంజూరు అయిన 1079 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

అనంతరం 62 లక్షల రూపాయల విలువ గల 62 కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని, అలాగే రేషన్ కార్డు రానివారు కంగారు పడాల్సిన పనిలేదని రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రానివారు మీ సేవలో కానీ లేదంటే ప్రజా పాలనలో  మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తెలంగాణలో దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా అవకాశం కల్పించామని వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్ళీ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ప్రభుత్వ దాన్యం నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు అందించేందుకు ఈ కార్డులు కీలకం కానున్నాయని తద్వారా మరిన్ని పేద కుటుంబాలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు నుండి లబ్ధి పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, డిఆర్డిఓ రఘువరన్, తహసిల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, నందగిరి సింగిల్ విండో చైర్మన్ కర్ర భాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఓరు గల శ్రీనివాస్, 

తాటిపర్తి శోభారాణి, తడగొండ రాజు, కడారి తిరుపతి, బండారి శ్రీనివాస్, సింగ సాని స్వామి, సంధి మల్లారెడ్డి డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్, చెట్ల కిషన్, చాట్ల ప్రశాంత్ మందపల్లి అంజయ్య తడగొండ తిరుపతి కార్యకర్తలు రేషన్ కార్డు లబ్ధిదారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Comments