రంజిత్ కేర్ ఆఫ్ వెంకటాపురం మూవీ టీజర్ విడుదల.

Rathnakar Darshanala

 రంజిత్ కేర్ ఆఫ్  వెంకటాపురం మూవీ టీజర్ విడుదల.

 నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి జులై 28 :

ఆడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రంజిత్ కేర్ ఆఫ్ వెంకటాపురం అనే చిత్రం నిర్మిస్తున్న వార్త అందరికీ తెలిసిందే ఈ చిత్రానికి ప్రధాన పాత్రలో రౌడీ సింగర్ గోపి మరియు అపర్ణ గారు కనిపించబోతున్నారు.

 ఈ సినిమా కి విక్రమ్ ఆర్ కథ మరియు దర్శకత్వం వహిస్తున్నారు సినిమాటోగ్రాఫర్ ఆసం రాజశేఖర్ నిర్మాతలు పొగరి సంజీవ్ మరియు గుగ్లావత్ అరవింద్ నిర్మిస్తున్నారు.

మహేష్ చింతల్బోరి సంగీతం వహిస్తున్నట్లు  ఇట్టి సినిమా యొక్క పూర్తి చిత్రికరణ నిర్మల్ జిల్లాలో నే జరిగినట్లుగా చిత్ర యూనిట్ తెలుపడం జరిగింది.
 మరియు ఇటీవల జరిగిన ఇట్టి చిత్ర సమావేశం లో ఈ సినిమా యొక్క టీజర్ ను ఆగస్టు 03 తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

మరియు ఈ సినిమా ప్రతి ఒక్క యువతకు ఆకట్టుకొనే విధంగా ఉంటుంది అని ఈ చిత్రం లో ఎడిటర్ గా శ్రీషేకు మరియు మల్లెల సాయి జయంత్ మరియు శ్రీధర్ ఆనంద్ శివ అంబాజీ తదితరులు యూనిట్ బృందం గా ఉన్నట్లు తెలిపారు
Comments