Ap :వరికపూడిశెల పనులకు మార్గం సుగమం.
By
Rathnakar Darshanala
వరికపూడిశెల పనులకు మార్గం సుగమం.
*రూ.14.81 కోట్లు జమ చేసిన ప్రభుత్వం*
పల్నాడు జిల్లా బ్యూరో జూలై 29(నేటి వార్త)
పల్నాడు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి సాగునీరు అందించే వరికపూడిశెల ప్రాజెక్టు పనులకు మార్గం సుగమ మైంది.
అటవీ శాఖకు చెల్లించాల్సిన రూ.14.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జమ చేయడంతో అడ్డంకి తొలగిపోయింది. బడ్జెట్లో నిధులు కేటాయించినా విడుదల చేయడంలో జాప్యం జరుగుతున్నది.
ఈ పథకం పూర్తయితే పల్నాడు జిల్లా మాచర్ల, వినుకొండ, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో 1,00,114 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిధులు జమ కావడం.. అటవీ శాఖ నుంచి అడ్డంకి తొలగిపోవడంతో తొలి, రెండోదశ నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చొరవ చూపడంతో నిధుల సమస్య పరిష్కారమైంది.
వరికపూడిశెల ప్రాజెక్ట్ ని తొందరలోనే కట్టి పూర్తి చేస్తామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారు.
Comments