ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం.త్వరలో 1690 వైద్య పోస్టులు భర్తీ.

Rathnakar Darshanala
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం.త్వరలో 1690 వైద్య పోస్టులు భర్తీ.
- త్వరలో రాష్ట్రంలో 1690 వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు.

- అప్రమత్తత తోనే సీజనల్ వ్యాధులు
 అంతగా నమోదు కావడం లేదు.

- రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్.

నేటివార్త, జూలై 28, బెల్లంపల్లి:

రాష్ట్రంలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేయడంతోనే సీజనల్ వ్యాధుల కేసులు అంతగా నమోదు కావడం లేదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. 

సోమవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. కోటేశ్వర్, ప్రభుత్వ ఏరియాఆసు పత్రి సూపరిండెంట్ డాక్టర్ జీడి. రవికుమార్ వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ పరిధిలోగలఆస్పత్రుల్లో త్వరలో 1690 వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య నిపుణుల నియామకంతో పాటు ఇక్కడ సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంకు లను ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

అందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అంతే కాకుండా మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రానున్న రోజుల్లో ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. 

మంచిర్యాల జిల్లాలో గత ఏడాది సీజనల్ మలేరియా కేసులు 200 నమోదు కాగా నేడు ఈ సంఖ్య 20 కి తగ్గి పోయిందన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 

ఈ ఆస్పత్రిలో పోస్టుమార్టం గది, ప్రహరీ గోడ కు నిధులు మంజూరు చేయాలని అధికారులు కమిషనర్ ను కోరారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. 

ఆసుపత్రి నిర్వహణ తీరు చాలా బాగుందని కమీషనర్ పేర్కొన్నారు. ఇలానే మైంటైన్ చేయాలని వైద్యులకు సూచించారు. వార్డుల్లో పర్యటించి చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. 

ఆయన వెంట రాష్ట్ర బయో మెడికల్ ఇంజనీర్ శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ షబ్బీర్ రహ్మద్, డాక్టర్ కిరణ్ కుమారి, మూర్తి, తదితరులు ఉన్నారు.
Comments