అంగమయ్య నగర్‌లో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవం ఘనంగా.

Rathnakar Darshanala
అంగమయ్య నగర్‌లో శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవం ఘనంగా.
ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాగూర్.

నేటి వార్త జూలై 27 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.

అంగమయ్య నగర్ కాలనీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీ శ్రీ నల్ల పోచమ్మ బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. 

ఈ వేడుకలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ  ఎం.ఎస్. రాజ్ ఠాగూర్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

శ్రీ శ్రీ నల్ల పోచమ్మ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పూజా కార్యక్రమాలు, 

సాంస్కృతిక ప్రదర్శనలు అత్యంత శోభాయమానంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ, "బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబం. 

దేవతలకు బోనాలు సమర్పించడం ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు శాంతి కోసం ప్రార్థించడమే" అని తెలిపారు.

కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Comments