టీయూడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన అల్లె రాముకు ఘన సన్మానం.
By
Rathnakar Darshanala
టీయూడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన అల్లె రాముకు ఘన సన్మానం.
నేటివార్త, జగిత్యాల బ్యూరో, జూలై 27:
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజె/ఐజెయూ) జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ అల్లె రాము ను కోరుట్లలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువాతో సత్కారం నిర్వహించగా, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మండలోజు పవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు వనతడుపుల నాగరాజు, గుండోజి మురళీకృష్ణ, గుండోజి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
అల్లె రాము జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిగా, నూతన పదవిలో విశేషంగా సేవలందించాలని సంఘ సభ్యులు ఆకాంక్షించారు.
Comments