మిత్రుడి కుటుంబానికి చేయూతగా 20 వేల రూపాయల సాయం.
By
Rathnakar Darshanala
ఆత్మీయ మిత్రుడి కుటుంబానికి చేయూతగా 20 వేల రూపాయల సాయం.
నేటివార్త రాయికల్ జూలై 27:
రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పెగ్గర్ల శ్రీధర్ గుండెపోటుతో ఇటీవల మరణించారు.ఆయన కుమార్తెలు అంజన మరియు శ్రీనీత అనాధలుగా మిగిలిన సంగతి తెలుసుకున్న చిన్ననాటి మిత్రులు హృదయంగా స్పందించారు.
1999-2000 విద్యా సంవత్సరానికి చెందిన మిత్రులు ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి,వారి పిల్లలకు చేయూత అందించాలన్న సంకల్పంతో ముందుకొచ్చారు.
ఈ క్రమంలో మిత్రులందరూ కలిసి రూ. 20,000 (ఇరవై వేలు) నగదు సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లీపూర్,కిష్టంపేట,సింగరావు పేట,కురుమపల్లె,మోరపెల్లి, ఆలూరు,రాజనగర్, వీరాపూర్,
అయోధ్య, ఉప్పుమడుగు,కన్నాపూర్, శ్రీరామ్ నగర్ గ్రామాలకు చెందిన 1999-2000 బ్యాచ్ స్నేహితులంతా పాల్గొన్నారు.
స్నేహం అనేది కాలాన్ని, దూరాన్ని దాటి నిలిచిపోయే బంధమని మరోసారి నిరూపించిన ఈ సంఘటన, సమాజానికి,మానవతా స్పూర్తికి ప్రతిబింబంగా నిలిచింది.
Comments