అచ్యుతానందన్ మృతికి సంతాపం.

Rathnakar Darshanala
అచ్యుతానందన్ మృతికి సంతాపం.
 
నేటి వార్త జూలై 22 కాగజ్ నగర్: 

కేరళ రాష్ట్ర మాజీ సీఎం అచ్యుతానందన్ మృతి కి సంతాపం తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో కాగజ్ నగర్ కార్యాలయంలో సంతాపం తెలియజేశారు.

 మాజీ సీఎం అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. వామపక్ష పార్టీలు కేరళలో అగ్రగామిగా నిలపడంలో ఆయన కృషి చేశారన్నారు. 

తన జీవితకాలంలో నిబద్దతతో పనిచేసిన గొప్ప నాయకుడు అచ్యుతానందన్ మరణం భారత కమ్యూనిస్టు పార్టీ కు తీరనిలోటని అన్నారు.

 సిపిఎం సిర్పూర్ కన్వీనర్ కామ్రేడ్ ముంజం ఆనంద్ కుమార్ , కామ్రేడ్ కూషణ రాజన్న, జాడి మల్లయ్య లు పాల్గొన్నారు.
Comments