నాగోబాను దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.
By
Rathnakar Darshanala
నాగోబాను దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.
(నేటి వార్త)నార్నూర్
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోభ ఆలయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దర్శించుకున్నారు.
మంగళవారం నాగుల పంచమి సందర్బంగా కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం మెస్రం వంశీయులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించారు.ఆదివాసుల సమస్యలు పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, నాగోబా జాతర అభివృద్ధి కోసం పాటుపడతామన్నారు.
సుగుణక్క వెంట ఆలయ చైర్మన్ ఆనంద్ రావు పాటేల్,మెస్రం వెంకట్ రావు పటేల్,కోసేరావు పటేల్,సంతోష్,రాంకిషన్,వినోద్ తదితరులు ఉన్నారు.
Comments