*మట్టి గణపతి కర్ర పూజ మహోత్సవంలో పాల్గొన్న.ఎమ్మెల్యే విజయరమణారావు*

Rathnakar Darshanala
*మట్టి గణపతి కర్ర పూజ మహోత్సవంలో పాల్గొన్న.
ఎమ్మెల్యే విజయరమణారావు*
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 20 ఆడిచర్ల రమేష్

పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఏర్పాటు చేసే భారీ మట్టి గణపతి ప్రతిష్టాపనలో భాగంగా,

 ఆదివారం రోజున ఛత్రపతి యువసేన సభ్యులతో స్థానిక నాయకులతో కలిసి గణనాథుని మండపం కర్ర పూజ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణారావు.

అనంతరం ఛత్రపతి యువసేన సభ్యులు ఎమ్మెల్యే విజయ రమణారావు ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఛత్రపతి యువసేన సభ్యులు,మాజీ కౌన్సిలర్లు,పట్టణ వ్యాపారులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments