ఆదివాసీల బంద్ కు సంపూర్ణ మద్దతు---ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.

Rathnakar Darshanala
ఆదివాసీల బంద్ కు సంపూర్ణ మద్దతు---ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.
 
నేటి వార్త జూలై 20 కాగజ్ నగర్:

 జీవో నెంబర్ 49 ని రద్దు కోరుతూ ఈనెల 21న ఆదివాసి సంఘాలు తలపెట్టిన బంద్ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా లోపాయి కారిగా, లోప భూయిష్టంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని మొత్తం అటవీ ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించడం ఆదివాసుల హక్కులు కాలరాయడమేనని ఆయన అన్నారు. 

ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇంత దారుణమైన నిర్ణయం చేయడం దారుణం అన్నారు. 

గ్రామ సభలు నిర్వహించకుండా, స్థానికులను సంప్రదించకుండా, విధానపరమైన నిర్ణయాలు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత అనాలోచితంగా వ్యవహరించిందో ప్రజలు అర్థం చేసుకోవచ్చన్నారు. 

ఆదివాసీల హక్కులు కాలరాసే జీవో 49 రద్దుకై ఆదివాసి సంఘాలు ఇచ్చిన బందు పిలుపు కు మద్దతు తెలియజేస్తూ ప్రజలు, వ్యాపారస్తులు, కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలపాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుత తరం, రాబోయే తరం పిల్లలపై ప్రభావం చూపే ఈ జీవో నెంబర్ 49 మీ రద్దు చేసే వరకు ఈ పోరాటంలో భాగస్వాములమవుతామని ఆయన తెలిపారు.
Comments