ADB :నిరుపేదల పెన్నిధి సీఆర్ఆర్- కంది శ్రీనివాస రెడ్డి.
By
Rathnakar Darshanala
నిరుపేదల పెన్నిధి సీఆర్ఆర్- కంది శ్రీనివాస రెడ్డి.
ప్రజా సేవాభవన్ లో ఘనంగా వర్ధంతి కార్యక్రమం
హాజరైన కాంగ్రెస్ ప్రముఖులు
* పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు
* సీఆర్ ఆర్ సేవలను కొనియాడిన నేతలు
నేటి వార్త ఆదిలాబాద్ బ్యూరో :
ఆదిలాబాద్ : మాజీ మంత్రి వర్యులు స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి నిరుపేదల పాలిట పెన్నిధి అని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఆదివారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ లో సీఆర్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంది శ్రీనివాస రెడ్డి సీఆర్ఆర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
అనంతరం కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప నాయకుడు సిఆర్ ఆర్ అని కొనియాడా. గరీబోళ్ల నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు.
అయన ఆశయ సాధన కోసం పనిచేద్దామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి,
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య,టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ,సెడ్మకె ఆనంద రావు,
భూపల్లి శ్రీధర్ , గుడిపల్లి నగేష్,గిమ్మసంతోష్ ,సామ రూపేష్ రెడ్డి, కలాల శ్రీనివాస్, మునిగెల విఠల్, ఎంఏ షకీల్, రామ్ కుమార్,ఫైజుల్లా ఖాన్, రాందాసం నాక్లే, దాసరి ఆశన్న, శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు.
Comments