ఇందిరమ్మ ఇల్లు ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.

Rathnakar Darshanala
ఇందిరమ్మ ఇల్లు ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.
- నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.

- ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
- దుగ్గొండి మండల కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్.

 నేటివార్త, దుగ్గొండి : నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ అన్నారు.

దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు గుండెకారి సునీల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఈరోజు  దర్వాజా అధిరోహణ కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టగా,

ఈ కార్యక్రమానికి దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ హాజరై,గుడ్డెలుగులపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులతో కలిసి ద్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ మాట్లాడుతూ మండలంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అన్ని గ్రామాలలో మొదలయ్యాయని అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాలో మొదటి విడత డబ్బులు జమ కావడం జరుగుతుందని,ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మట్ట రాజు,మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి జంగిలి రవి,గ్రామ పార్టీ అధ్యక్షులు జంగిలి నగేష్,మండల యూత్ కాంగ్రెస్ నాయకులు తొర్రురు రవి,బొబ్బరోణిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు చెన్నారపు రాజు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments