యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి కి వినతి.

Rathnakar Darshanala
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి కి వినతి.
నేటివార్త జగిత్యాల బ్యూరో జూలై 28:

జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రివర్యులు ఈ జీవన్ రెడ్డి కి యువజన కాంగ్రెస్ నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20% సీట్లు కేటాయించాలని కోరడం జరిగింది.

మాజీమంత్రివర్యులు సానుకూలంగా స్పందించి స్థానిక సంస్థల ఎన్నికల్లో యువకులే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బలమని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్, పుప్పాల రాజశేఖర్,కాటిపెళ్లి రాజశేఖర్ రెడ్డి,చీటీ వినయ్ కుమార్, ఎంబారి సురేష్ ,కొండ్ర ప్రమోద్ ,జోగినిపల్లి వినోద్ బండారి మధు, భోగ సందీప్,మహమ్మద్ షకీర్, బొద్దుల శివ కుమార్,బాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments