పెద్దపల్లి ఎ.సి.పి.గజ్జి కృష్ణను పరామర్శించిన.
By
Rathnakar Darshanala
పెద్దపల్లి ఎ.సి.పి.గజ్జి కృష్ణను పరామర్శించిన.
తెలంగాణ ఎస్సీ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆరెల్లి మల్లేష్..
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 28 ఆడిచర్ల రమేష్
పెద్దపల్లి ఎ.సి.పి.గజ్జి కృష్ణను తెలంగాణ ఎస్సీ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆరెల్లి మల్లేష్ పరామర్శించారు.పెద్దపల్లి ఎసిపి గజ్జి కృష్ణ తండ్రి ఐలయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని ఓ పంక్షన్ హాల్‌లో జరిగిన పెద్దకర్మలో తెలంగాణ ఎస్సీ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆరెల్లి మల్లేష్ పాల్గొన్నారు.
ముందుగా పెద్దపల్లి ఎసిపి గజ్జి కృష్ణను పరామర్శించి అనంతరం ఐలయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు లైసెట్టి రాజు,కలవేన రాజేందర్,పిల్లి రమేష్,న్యాయవాదులు సిరిమల్ల అనిల్,అవినాష్ తదితరులున్నారు.
Comments