స్థానిక సంస్థ ల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. – దావ వసంత సురేష్.

Rathnakar Darshanala
స్థానిక సంస్థ ల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.
 – దావ వసంత సురేష్.
నేటివార్త రాయికల్,జూలై 23:

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తాజా మాజీ జడ్పీ తొలి అధ్యక్షురాలు దావ వసంత సురేష్ పిలుపునిచ్చింది. 

రాయికల్ మండలంలోని పద్నాలుగు మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో ఉన్న ముప్పై రెండు గ్రామాల్లో మూడు వర్గాలుగా అల్లీపూర్, రాయికల్,ఒడ్డెలింగాపూర్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించింది.

ఈ సందర్భంగా వసంత సురేష్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అందించిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయాలని,ప్రతి గ్రామంలోకి వెళ్లి మద్దతు కోరాలని పిలుపునిచ్చింది.

రాబోయే ఎన్నికల్లో మెజారిటీ మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలు గెలుచుకొని మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని,జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలను కైవసం చేసుకోవాలని సూచించింది.

ఈ సమావేశాల్లో మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్,సమన్వయకర్త తురగ శ్రీధర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్,సహకార సంఘం అధ్యక్షుడు రాజలింగం,మాజీ వ్యవసాయ మార్కెట్ సంఘం అధ్యక్షులు ఉదయశ్రీ,రాణి సాయికుమార్, 

మాజీ ఉప మండల పరిషత్ అధ్యక్షుడు మహేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి కొండపల్కుల రత్నాకర్ రావు, మాజీ కౌన్సిలర్ కన్నాక మహేందర్, సీనియర్ నాయకులు శ్రీరాముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments