భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలీ.ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.

Rathnakar Darshanala
భారీ వర్షాల నేపథ్యంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలీ.ఎమ్మెల్యే  జారే ఆదినారాయణ.
అశ్వారావుపేట నియోజకవర్గం నేటి వార్త ప్రతినిధి దారా విష్ణు 23/ జూలై

గత మూడు రోజులుగా నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో మరింత అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో  నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సంబంధిత అధికారులకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని కోరారు.

ఏదైనా సమస్య తలెత్తితే తక్షణమే మండలంలోని ఎంపీడీవోను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసేందుకు, అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

 అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
Comments