పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జారె.
By
Rathnakar Darshanala
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జారె.
అశ్వారావుపేట నియోజకవర్గం నేటి వార్త ప్రతినిధి డి. విష్ణు 23/ జూలై :
దమ్మపేట మండలంలో పర్యటించిన స్థానిక శాసన సభ్యులు జారె ఆదినారాయణ
ముష్టిబండ గ్రామంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో ట్రీట్మెంట్ పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నీరకొండ సుబ్బారావు,నందమూరి రాంబాబు పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం అదే గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాలింగి నరసమ్మ, కడియం రాములు కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల ద్వారా పాఠశాల సమస్యలు తెలుసుకొని త్వరలోనే పరిష్కరిస్తానని తెలియజేసారు,
వడ్లగూడెం గ్రామంలో నెల్లూరి రాములు దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments