వైద్యం వికటించి రాజు అనే వ్యక్తి మృతి.
By
Rathnakar Darshanala
వైద్యం వికటించి రాజు అనే వ్యక్తి మృతి.
*--రాజు మృతికి కారకులు ఎవరు?*
*--అతడు ఎంచుకున్న హాస్పిటల్'లా లేక అందాల్సిన చికిత్స అందకపోవడమా?*
*--చికిత్స అనంతరం భరోసా లేని హాస్పిటల్ చేతులెత్తేస్తున్న యజామాన్యం*
*--బాదితుని భార్య పిల్లలు బంధువులు ప్రవేట్ హాస్పిటల్ లో ధర్నా*
*--పరిమితికి మించి చికిత్స రాజు మృతికి కారణమా?*
*--ప్రాణాలు బతికించుకుందామని హాస్పిటల్'కు వస్తే ప్రాణాలు తీస్తున్న డాక్టర్లు*
*నేటివార్త జులై 25(వనపర్తి జిల్లా ప్రతినిధి)*
పెబ్బేరు పట్టణ కేంద్రంలో ఓ ప్రవేట్ హాస్పిటల్'లో చికిత్స తీసుకున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన వివరాల్లోకెళ్తే పెబ్బేర్ మండల పరిధిలోని పెంచలపాడు గ్రామానికి చెందిన కాటపాగ రాజు తండ్రి కాటపాక నరసింహ వయసు 35 సంవత్సరాలు వృత్తిరీత్యా మేస్త్రి పని చేస్తాడు.
తనకు భార్య రాధా 30 సంవత్సరాలు వృత్తి కూలీ చేస్తుంది, నలుగురు పిల్లలు కలరు. పెద్ద కూతురు సౌజన్య, 9 సంవత్సరాలు 4వ తరగతి చదువుతుంది. పెద్ద కొడుకు మహేందర్ 7 సంవత్సరాలు 2వ తరగతి చదువుతున్నాడు,రెండవ కొడుకు బిట్టు 5 సంవత్సరాలు,చిన్న కొడుకు అంగన్వాడీ బడికి వెళుతున్నాడు,
చిన్నాఅమ్మాయి చిన్ను 2 సంవత్సరాలు కుటుంబానికి పెద్దదిక్కు అయినా రాజు ఆకస్మిక మృతితో కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చేసింది, బతకాలని ఆశతో చెవి వెనకాల చీము గడ్డ కట్టడంతో ప్రవేట్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం వస్తే, ఎలాంటి టెస్టులు చేయకుండా చికిత్స చేసి మందులు ఇచ్చి పంపించడం జరిగింది.
అసలు మెడకు ఎందుకు చీము వచ్చిందని నిర్ధారించకుండానే డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేశారు. ఏది జరిగిందో తెలుసుకోకుండా ఏ చికిత్స చేయాలో తెలియకుండా ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేసే రీతిలో ఎంబిబిఎస్ డాక్టర్లు చేయడం సిగ్గుచేటని ప్రజలు వాపోతున్నారు.
అసలు హాస్పిటల్ కి వెళ్తే పరిమితి అయిపోయిన మందులు ఇస్తున్నారు. సంబంధిత డ్రక్స్ ఆఫీసర్ తాత్కాలికంగా వారం రోజులు ప్రవేట్ హాస్పిటల్ మందుల షాపును ముసివేయడం జరిగింది.
అయినా కూడా బుద్ధి తెచ్చుకొని ప్రవేట్ హాస్పిటల్ యజమాన్యం చికిత్స వచ్చిన వ్యక్తికి ఎలాంటి టెస్టులు చేయకుండా నేరుగా వైద్యం చేయడం దురదృష్టకరం, చికిత్స వికటించి రాజు చనిపోవడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బంధువులు పెద్ద ఎత్తున పెబ్బేరు పట్టణ కేంద్రంలోని ప్రవేట్ హాస్పిటల్'కు వచ్చి ధర్నా చేశారు. హాస్పటల్ చికిత్స వికటించి చనిపోతే యజమాన్యం డబ్బులతో వెల కడుతుంది.
పట్టణ కేంద్రంలో కొన్ని హాస్పిటల్లో చూస్తే అసలు వైద్యం కోసం వెళ్లాలా వద్దా అని స్థాయికి దిగజారిపోయిన్నాయి, హాస్పిటల్ కనిపించినంత రూపం హాస్పిటల్ వైద్యంలో రూపంలో లేదు.
పరిమితికి మించి చికిత్సలు చేస్తున్న హాస్పిటల్'లను సంబంధిత మెడికల్ అధికారులు తనిఖీలు చేయాలి అన్ని పెబ్బేరు పట్టణ, చుట్టుపక్కల గ్రామా ప్రజలు కోరుతున్నారు!
రాజు మృతికి కారకులు ఎవరు అతడు ఎంచుకున్న హాస్పిటల్'లా లేక అందాల్సిన చికిత్స అందకపోవడమా? ఎలాంటి వ్యసనాలకు అలవాటు లేని రాజు ఆకస్మికంగా కళ్ళు తిరిగిపోయి పడిపోయి చనిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Comments