జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా కల్లెడ పాఠశాల సందర్శన.

Rathnakar Darshanala
జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా కల్లెడ పాఠశాల సందర్శన.
నేటివార్త జగిత్యాల బ్యూరో, జూలై 25:

జగిత్యాల మండలంలోని కల్లెడ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజు ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు తదితర అంశాలను సమీక్షించారు. 

విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి పాఠాలు చదివించడం, బోర్డుపై రాయించడం ద్వారా వారి బోధన స్థాయిని పరిశీలించారు.తరువాత పాఠశాల కిచెన్‌ను పరిశీలించిన కలెక్టర్  వంటగదిలో శుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 

విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని ప్రశ్నిస్తూ తెలుసుకున్నారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మధ్యాహ్న భోజన తయారీ ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలంటూ సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్శనలో డీఈవో శ్రీ రాము, ఎంఈఓ, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments