Nirmal :నిర్మల్ పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.

Rathnakar Darshanala
నిర్మల్ పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.

నిర్మల్ పోలీస్... మీ పోలీస్.

*నిర్మల్ పట్టణంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం*

*నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరం – పోలీసులు*

   నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి జులై 26
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ దిశానిర్దేశాల మేరకు ఈరోజు నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి వాడ, డబుల్ బెడ్‌రూమ్స్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

      ఈ కార్యక్రమంలో అనుమతులు లేకుండా నడుపుతున్న (70) ద్విచక్రవాహనాలు, (03) ఆటోమొబైల్ వాహనాలు స్వాధీనం చేసుకొని, సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడమైనది.

      ఈ సందర్భంగా నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ మాట్లాడుతూ –సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, మద్యం సేవనం, మైనర్ల చేత వాహనాల నడపడం వంటి సామాజిక మలినతలపై విపులంగా వివరణనిచ్చారు.అలాగే ఆస్తి సంబంధ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం అని స్పష్టంగా తెలియజేశారు.

  ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏ ఎస్పీ రాజేష్ మీన ఐపిఎస్ తో పాటు,పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,పోలీస్ స్టేషన్ సిబ్బంది, మరియు స్థానిక ప్రజలు భాగస్వాములయ్యారు.
Comments