మైనారిటీ పాఠశాలలో కళాశాలలో ప్రవేశలకు దరఖాస్తులు ఆహ్వానం.

Rathnakar Darshanala
బెల్లంపల్లి మైనారిటీ పాఠశాల మరియు కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం...
నేటివార్త, జూలై 27, బెల్లంపల్లి: 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఐదవ తరగతి మరియు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో చేరికల కొరకు మళ్లీ దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నీలు ఓ ప్రకటనలో తెలియజేశారు.

 ఆసక్తిగల మైనారిటీ విద్యార్థినులు ముస్లిం మరియు క్రిస్టియన్ ధ్రువీకరణ పత్రలతో పాఠశాల, కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 

కళాశాలలో ఎంసెట్ శిక్షణ సైతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. దరఖాస్తులకు గడువు చివరి తేది ఈనెల 31 వరకు ఉంటుందని తెలిపారు.
Comments