ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

Rathnakar Darshanala
ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ. ఎమ్మెల్యే సంజయ్ కుమార్.
–అర్హులందరికీ గృహాలు కలుగజేస్తామన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

నేటివార్త రాయికల్ జూలై 25:

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో భూపెల్లి కవిత గోపి, బొమ్మెన మమత మొగిలి, బొమ్మెన లావణ్య సుల్తాన్, మకిలి రాజవ్వ ముత్తయ్యల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి స్వంత ఇంటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు గృహ స్వప్నం సాకారమవుతుందని తెలిపారు.అర్హత కలిగినవారికి ఇళ్లు మంజూరు కాకపోతే ఆందోళన అవసరం లేదని,

 ప్రభుత్వం నిర్ద్వందంగా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, ఏఈ ప్రసాద్, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, మాజీ ఏఎంసి ఛైర్మన్ గన్నే రాజిరెడ్డి,కోల శ్రీనివాస్, రవీందర్ రావు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ముకీద్, తిరుపతి గౌడ్ తో పాటు గ్రామ,మండల నాయకులు,మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments