చిన్ననాటి స్నేహితుడికి... ఆపన్న హస్తంగా .
By
Rathnakar Darshanala
చిన్ననాటి స్నేహితుడికి... ఆపన్న హస్తంగా .
..స్నేహితుడి కూతురి పేరిట డిపాజిట్.
నేటి వార్త :- తమతోపాటు చిన్నప్పటినుండి కలిసి మెలిసి ఉన్న స్నేహితుడు నిజజీవితంలో భార్యను కోల్పోయి ఆ కుటుంబానికి స్నేహితులందరూ మేమున్నామంటూ ఆపన్న హస్తము అందజేశారు.
జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరంలో విద్య నేర్చుకున్న చిన్ననాటి స్నేహితులందరూ కలిసి అదే పాఠశాలలో విద్యనభ్యసించిన స్నేహితుడికి అండగా నిలిచారు.
ముత్యాల అశోక్ అతని భార్య ముత్యాల అనిత అనారోగ్యంతో ఇటీవల కాలంలో మృతి చెందింది. వారికి కూతురు ముత్యం మాన్య ఉంది.
ముత్యాల అశోక్ కు అండగా తనతోపాటు చదువుకున్న తోటి విద్యార్థులు అందరూ కలిసి 20వేల 116 రూపాయలను అశోక్ కూతురైన మాన్య పేరిట సుకన్యా పథకం కింద డిపాజిట్ చేశారు.
ఈ పత్రాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నాగూర్లపల్లి గ్రామంలో ఉంటున్న మిత్రుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, రాంబాబు, తిరుపతి, శ్రీనివాసరావు ,సదానందం రాజు ,తదితరులు పాల్గొన్నారు.
Comments