వరంగల్ డిక్లరేషన్ తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.

Rathnakar Darshanala
వరంగల్ డిక్లరేషన్ తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.
-రైతుల హామీలు నెరవేర్చేదాక వెంటాడుతాం.. 
-బిజిపి కిసాన్ మోర్చ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్..

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జూలై 24 అడిచెర్ల రమేష్.

ఎన్నికల సందర్భంగా వరంగల్లులో రైతు డిక్లరేషను ప్రకటించి రైతులకు అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బిజెపి కిసాన్ మోర్చ రాష్ట్ర కన్వీనర్ టి.శ్రీనివాస్ విమర్శించారు.

రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ,రూ.2లక్షల రుణమాఫీకోసం 60శాతం మంది రైతులు 19నెలలుగా ఎదురు చూస్తున్నారని అన్నారు.ఖరీఫ్, రబీ కలుపుకుని ఎకరాకు ప్రతీ ఏడాది రూ.15వేలు చెల్లిస్తామని చెప్పి మొహం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు పంటలకు ఎగనామం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6వేల చొప్పున చెల్లించి రైతుల ఊసురు పోసుకున్నదని అన్నారు.పంటల భీమాయోజన పథకాన్ని అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.

ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీతో పాటు వరి, మొక్కజొన్న,కందులు, సోయాబీన్,పత్తి,మిర్చి,పసుపు, ఎర్రజొన్న,చెరకు,జొన్న పంటలకు రూ.500 బోనస్ చెల్లించాలని,

 రైతుభరోసా ఎకరాకు రూ.15 వేలు,కౌలు రైతులకు కూడా రైతుభరోస వర్తింపజేయాలని,వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు, నకిలి విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా 

వ్యవహరించాలని,సబ్సిడీపై వ్యవసాయ యాంత్రిక పరికరాలు అందించాలని,పండ్లతోటల రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్ అమలు పరిచేవరకు కాంగ్రెస్ పార్టీ వెంటపడుతామని హెచ్చరించారు

.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం,నాయకులు జంగ చక్రధరరెడ్డి, అక్కపెల్లి క్రాంతి, బెజ్జంకి దిలీప్,భూషణవేణి శ్రీనివాస్ గౌడ్,చాట్ల కొండల్, కాసనగట్టు విజయ్, వెంకటేష్ కరుణాకర్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments