చినుకు వానకే చిత్తడైన హౌసింగ్ బోర్డు రహదారి – స్థానికుల ఆవేదన.

Rathnakar Darshanala
చినుకు వానకే చిత్తడైన హౌసింగ్ బోర్డు రహదారి – స్థానికుల ఆవేదన.
నేటివార్త, జగిత్యాల బ్యూరో, జూలై 26:

జగిత్యాల పట్టణంలోని 9వ వార్డు అచ్చుబండలోని పోచమ్మ ఆలయం సమీప హౌసింగ్ బోర్డు కాలనీలో రహదారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 

ఇటీవల కురిసిన తక్కువ వర్షానికే రహదారి పూర్తిగా బురదమయమై ప్రయాణానికి అడ్డంకిగా మారింది. ముఖ్యంగా సిమెంట్ లోడ్ తో వెళ్తున్న వాహనం బురదలో దిగబడిన సంఘటన రహదారి దుస్థితిని బట్టబయలు చేసింది.

ఈ దారిలో రోజు స్కూలు పిల్లలు, వృద్ధులు, మహిళలు రాకపోకలు సాగిస్తుండగా, బురద, నీటి గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

వాహనాల తాకిడికి రహదారి మరింత దెబ్బతింటోంది. ఇకపోతే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా ఈ దారిలో నడవలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రహదారి సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులకు తెలిపినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం నిరాశకు గురి చేస్తోందన్నారు. 

ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్టిలో ఉంచుకుని తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని అధికారులను కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments