సీజనల్ వ్యాధుల పట్ల పెద్దపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Rathnakar Darshanala
సీజనల్ వ్యాధుల పట్ల పెద్దపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్.. 

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 25 ఆడిచర్ల రమేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళిక - ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంలో భాగంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సి.డి.ఎం.ఏ.డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ )జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున" డ్రై డే ఫ్రై డే" కార్యక్రమం నిర్వహించారు.

ఈసందర్భంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు మెప్మా సిబ్బంది ఆశా వర్కర్లతో ప్రతి వార్డులో ఇంటి యజమానులకు  అవగాహన నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్  మాట్లాడుతూ,గత మూడు రోజుల నుండి ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున,

 పెద్దపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మీ ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలని ఇంట్లో పాత టైర్లు,డబ్బులు,కొబ్బరి బొండాలు,కులర్ డబ్బల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు.

అలా ఉన్నట్లయితే అందులో వర్షపునీరు నిల్వవుండి నీటిపై దోమలు గుడ్లు పెట్టి దోమలు అభివృద్ధి చెందుతాయని అట్టి దోమల వల్ల మలేరియా,డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకి మరణాలు సంభవిస్తాయని అన్నారు,

 అన్ని వార్డులో వార్డ్ ఏఎన్ఎం వర్కర్,అంగన్వాడి కార్యకర్తలతో సమన్వయంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందుకు వార్డు ప్రజలు సహకరించాలని అన్నారు. కూరగాయల మార్కెట్ యజమానులు మీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే మటన్,చికెన్ విక్రయించే వ్యాపారులు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.మీ ఇంట్లో చెత్తను రోడ్లపై,మురికాలువల్లో వేయకుండా తడి పొడి చెత్త గా వేరు చేసి మా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు,సానిటరీ ఇన్స్పెక్టర్లు,మున్సిపల్ ఆశా వర్కర్లు మెప్మా ఆర్పీలు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
Comments