కాంగ్రెస్ నాయకులను వేధిస్తే... ఖబర్దార్.

Rathnakar Darshanala
కాంగ్రెస్ నాయకులను వేధిస్తే... ఖబర్దార్.

బీసీ బిల్లు పై నోరుమెదపని కౌశిక్ రెడ్డిని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది...

ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వార్నింగ్...

పీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో తొలి పర్యటన...

 నేటి వార్త జమ్మికుంట :- పీసీసీ ఉపాధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కు గురువారం జమ్మికుంట పుర పరిధిలో ని కొత్తపల్లిలో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను వేధిస్తే...తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

 కౌశిక్ రెడ్డి స్వయంగా నియోజకవర్గానికి ఏమీచేయలేకపోయినా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం కమలాపూర్ లో ప్రజలకు కల్యాణలక్ష్మీ చెక్కులు అందిస్తే స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కుల కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఇచ్చాడంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు అని ఎద్దేవ చేశారు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కారుకు ఉన్న నాలుగు చక్రాలను నలుగురు పీక్కు పోయారని కారు డ్రైవర్ ఫామ్ హౌస్ లో పన్నాడని ఇకనైనా కౌశిక్ రెడ్డి ఇతర పార్టీల గురించి మాట్లాడడం మానేసి తన పార్టీలో ఉన్న పరేషాన్ పట్టించుకోవాలని సూచించారు .

ఇకనైనా టిఆర్ఎస్ పార్టీ బీసీలకు రావలసిన 42 శాతం రిజర్వేషన్లపై స్పందించకుంటే కౌశిక్ రెడ్డిని నియోజకవర్గంలోని బీసీలు రాళ్లతో కొట్టి తరిమేసే పరిస్థితి వస్తుందని తీవ్రంగా దుయ్యబట్టారు .

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ యెగెలుస్తుందని ,పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తుంచుకొని నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ నాయకులతో కలిసి గెలిపించుకునే బాధ్యత మాదే అని అన్నారు .
 
అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా, నియోజకవర్గ బాధ్యులు, జిల్లా నేతలను కలుపుకుని గెలిపించడానికి కృషి చేస్తానని, చెప్పారు. 

ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా ....

చుట్టూ 100 గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చే జమ్మికుంట ప్రభుత్వా ఆస్పత్రి అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని ,ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తో మాట్లాడి ఆస్పత్రిలో కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయిస్తానన్నారు .

వ్యాపార కేంద్రమైన జమ్మికుంట నుండి హైదరాబాదుకు లోగడ నిత్యం బస్సులు నడిచేవని వాటిని కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి బస్సుల పునరుద్ధరణకు చొరవ చూపిస్తానని ,

బస్సులు ప్రారంభమైన మొదటి రోజు తానే స్వయంగా హైదరాబాద్ నుండి జమ్మికుంటకు బస్సులో ప్రయాణిస్తానని జమ్మికుంట ప్రజలకు హామీ ఇచ్చారు .

ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరుకాల వీరేశలింగం ,పొన్నగంటి మల్లయ్య ,ఎగ్గని శ్రీనివాస్ ,ఎర్రబెల్లి రాజేశ్వరరావుల తోపాటుకాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలుపాల్గొన్నారు.
Comments