కొమరం భీమ్ చౌరస్తాలో బస్ షెల్టర్ నిర్మించాలని ఎమ్మెల్యే కి వినతి.

Rathnakar Darshanala
కొమరం భీమ్ చౌరస్తాలో బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే కి వినతి.
నేటివార్త రాయికల్ జూలై 27:

రాయికల్ పట్టణంలోని కొమరం భీమ్ చౌరస్తా  మెయిన్ రోడ్ మీద జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం,ఇందిరా నగర్, బీసీ కాలనీ ప్రజలకు ముఖ్యమైన బస్ స్టాప్. జగిత్యాల–నిర్మల్ మార్గంలో నిత్యం వందలాది మంది ప్రయాణికులు బస్సులు ఎక్కి దిగే ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలేవీ లేకపోవడంతో, 

ప్రజలు ఎండలో ఇబ్బంది పడుతూ,వానలో తడుచుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందికి గురవుతున్నారని,

ఈ నేపథ్యంలో రాయికల్ పట్టణ కేంద్రానికి చెందిన పిప్పోజి మహేందర్ బాబు మాజీ ఎంపీటీసీ,మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, 

ఈ సమస్యను ఎమ్మెల్యేకి నివేదిస్తూ బస్సు షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments