సిమెంట్ రోడ్డు, కాలువలు, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయండి.

Rathnakar Darshanala
సిమెంట్ రోడ్డు, కాలువలు, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయండి.
పల్నాడు జిల్లా బ్యూరో జులై 20(నేటి వార్త)

చిలకలూరిపేట పట్టణంలోని 17వ వార్డుకు చెందిన రాచుమల్లు నగర్ వాసులు పలు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. 

గవర్నమెంట్ హాస్పిటల్ పడమర వైపున ఉన్న రోడ్డును అభివృద్ధి చేసి సిమెంట్ రోడ్డు, సైడ్ కాలువలు, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని స్థానిక శాసనసభ్యులకు వినతి పత్రాన్ని సమర్పించారు.

 ఈ సందర్భంగా చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వీలైనంత త్వరగా కాలనీవాసులు కోరిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఎమ్మెల్యేను కలిసిన వారిలో లోక్ సత్తా పార్టీ నాయకులు మాదాసు భాను ప్రసాద్, రాచుమల్లు నగర్ కాలనీవాసులు రమేష్, ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments