ADB :జొన్న పంటకు సంబందించి రైతుల ఖాతాలో మొత్తం డబ్బులు జమ.
By
Rathnakar Darshanala
జొన్న పంటకు సంబందించి రైతుల ఖాతాలో మొత్తం డబ్బులు జమ.
జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
అదిలాబాద్ జిల్లాలోని మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో, జొన్న పంటను ప్రభుత్వ మద్దతు ధర (రూ. 3371/- క్వింటాళ్ళకు)కు అమ్మిన రైతులకు ముఖ్యమైన సమాచారం:
ప్రభుత్వం నుండి మార్క్‌ఫెడ్ ప్రధాన కార్యాలయం ద్వారా, జిల్లాలో కొనుగోలు చేసిన జొన్నల మొత్తానికి గాను ఇప్పటివరకు రూ. 188.83 కోట్లు విడుదలయ్యాయి.
ఈ మొత్తం, జిల్లాలో జొన్నలు అమ్మిన 19285 మంది రైతులకు 19.07.2025 నాటికి విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా RTGS / NEFT ద్వారా జమ చేయబడినది.
ఈ విషయాన్ని జిల్లా రైతులందరూ గమనించగలరని జిల్లా పాలనాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments