90 లక్షల రూ.ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.
By
Rathnakar Darshanala
90 లక్షల రూ.ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.
-పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
-18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నా...
పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ.సిహెచ్ విజయరమణారావు..
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 28 అడిచర్ల రమేష్
పెద్దపల్లి మండలం,గౌరెడ్డిపేట, ముత్తారం గ్రామాల్లో సోమవారం రోజున 90 లక్షల రూ.ల నిధులతో పలు డ్రైనేజిలు,సిసి రోడ్లకు
శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు ముత్తారం గ్రామంలో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభోత్సవం చేసి అలాగే గౌరెడ్డిపేట,ముత్తారం గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను స్థానిక నాయకులతో కలిసి అందజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ,
రెండు లక్షల రూ.ల రుణమాఫీ,తిరిగి రుణ సదుపాయం,రూ.500 లకే గ్యాస్ సిలిండర్,ఉచిత కరెంటు,ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం,రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ,రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా
వైద్య సదుపాయానికి రూ.10 లక్షలకు పెంపు,కటింగులు లేకుండా వడ్ల కొనుగోల్లు,సన్న వడ్లకు రూ.500ల చొప్పున బోనస్,ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి ఎమ్మెల్యే అందజేస్తున్నట్టు చెప్పారు.
సంవత్సరంన్నర కాలంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.అలాగే గ్రామాల్లో అనేక అభివృద్ధి పథకాలను,రోడ్లు,డ్రైనేజీలు రవాణా వంటి మౌలిక సదుపాయాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
తాను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే అభివృద్ధి,సంక్షేమ పథకాలను మరింత ముందుకు తీసుకువెళ్లే వీలుంటుందన్నారు.కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళలు,పలు గ్రామాల ప్రజలు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Comments