కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు,420 హామీలు నెరవేర్చాలి...
By
Rathnakar Darshanala
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు,420 హామీలు నెరవేర్చాలి...
-రానున్న స్థానిక ఎన్నికల్లో బి.ఆర్.ఎస్పార్టీ గెలుస్తుంది..
-బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి,మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి..
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జూలై 27 ఆడిచర్ల రమేష్
6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం,వాటి హామీ విషయంలో మాత్రం మాట నిలుపుకోవడం లేదని,
వాటిని నెరవేర్చదాక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను,నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలని బి.ఆర్.ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని,మోసపోయామని గుర్తించిన తెలంగాణ ప్రజానీకం, తిరిగి పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు.
ఆదివారం పెద్దపల్లి పట్టణంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఎంఐఎం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎం.డి. ముఖిమ్ తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.మొకీం కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అంతకుముందు శాఖ ఆధ్వర్యంలో,పార్టీలో చేరుతున్న వారితో కలిసి బైక్ ర్యాలీ పెద్దపల్లి బస్టాండ్ నుండి కమాన్,జండా చౌరస్తా మీదుగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నమ్మకంతో,విశ్వాసంతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తొలినాళ్లలో పెద్దపల్లి పట్టణ ప్రజలు మంచినీళ్లకు ఎంతో గోసపడేవారని,అప్పుడు బొంపెల్లి గుట్టపై మంచినీటి పథకంతో, తదుపరి మిషన్ భగీరథ తో పెద్దపల్లి పట్టణ దాహార్తి పూర్తిగా తీర్చడం జరిగిందన్నారు.
బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేసుకొని, దానిలో సమృద్ధిగా నీటిని నింపుకోవడం ద్వారా మేజర్ పట్టణ భాగం కూడా బోరు బావులలో నీటి కొడతా లేకుండా చేసుకోవడమే కాకుండా, అందులో బోటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
పాలనలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు.పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మాత శిశు కేంద్రం నిర్మించడంతో వేలాదిమంది పేద మహిళలకు మేలు జరిగిందన్నారు.
ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యం చేయించడం జరిగిందని,అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచినట్లు తెలిపారు.టిఆర్ఎస్ పాలనలో కుల మతాలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు ప్రజలందరూ అందాయని,
ప్రస్తుతం అలా జరగడం లేదన్నారు. అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని తెలిపారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచుతామని,కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లో తులం బంగారం ఇస్తామని,
ఈనెల ప్రతి ఒక్క మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని పేర్కొన్నారు 6 గ్యారెంటీలు,420 హామీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Comments