శ్రావణమాసం 30 రోజులు నిత్య భజన కార్యక్రమము.

Rathnakar Darshanala
శ్రావణమాసం 30 రోజులు నిత్య భజన కార్యక్రమము.
నేటివార్త రాయికల్, జులై 26:

రాయికల్ మండలం  అల్లీపూర్ గ్రామములోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం 30 రోజులు భగవాన్ నామ స్మరణ నిత్య భజన కార్యక్రమము శుక్రవారం నుండి ప్రారంభం అయినది.

శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయ హనుమాన్ భజనమండలి వారి ఆధ్వర్యంలో గత 20 సం. లనుండి ప్రతి సంవత్సరం శ్రావణమాసం 30 రోజులు నిత్య భజన కార్యక్రమము కోనసాగుతుంది.

అని లోక కళ్యాణార్థం హైందవ సంప్రదాయము ప్రకారం కలియుగంలో భగవాన్ నామ స్మరణను మించిన అధ్యాత్మిక కార్యక్రమము మరోకటి లేదు అని అనుమల్ల మల్లేశం తెలిపినారు.

 ఎంతో పవిత్రంగా హనుమాన్ భజనమండలి సభ్యులు అందరు ఇట్టి కార్యక్రమము లో ప్రతి సంవత్సరము పాల్గొంటున్నారు. శ్రావణ మాసం 30 రోజులు నియమ నిష్టలతో ఇట్టి నిత్య భజన కార్యక్రమము 

కొనసాగుతుందని భజనమండలి ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సయ్య తెలిపారు.ఇట్టి కార్యక్రమము లో హనుమాన్ భజన మండలి అధ్యక్షులు చిట్యాల భూమయ్య,ప్రధాన కార్యదర్శి నామని లక్ష్మీ నర్సయ్య, 

గౌరవ అధ్యక్షులు బండారు ముత్తయ్య, క్యాషియర్ అనుమల్ల మల్లేశం,ప్రచార కార్యదర్శి ఉరుమడ్ల వాసు, ఎంబారి మల్లేశం,వేముల వెంకటయ్య, ఎల్లశ్వరం అశోక్, పోలస ప్రభాకర్ బోమ్మకంటి సురేష్,

ఎండపల్లి శేఖర్, పోల రమేష్, కొప్పుల గంగారెడ్డి, సాగి వినోద్ రావు,వేణు రావు,  కట్ట రవిందర్ రావు,గోపాల్ రెడ్డి , బొజ్జ దేవేందర్ రావు, దేవాలయ అర్చక పూజారి గురు లింగు మఠం విక్రమ్ అయ్యవారు తదితరులు ఫాల్గొన్నారు.
Comments