మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
By
Rathnakar Darshanala
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
*నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*
బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామం లో ఇటీవల మృతి చెందిన ఎగోళం రాజేశం
వారి కుటుంబనికి 71711/- రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.
10 వ తరగతి మిత్రుని మరణం చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు సాటి పూర్వ విద్యార్థి మిత్రులు.
ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ.. ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమన్నారు.
భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయన్నారు.
మిత్రుడు రాజేష్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంచికట్ల శ్రీనివాస్ జనగాం రాజకుమార్ కొమ్ము కోటి సుధాకర్ అశోక్ సంపత్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments