చౌటుప్పల్ లో వాహన తనిఖీల్లో దొరికిన దొంగలు.
By
Rathnakar Darshanala
చౌటుప్పల్ లో వాహన తనిఖీల్లో దొరికిన దొంగలు.
*మన్మధ కుమార్ సీఐ చౌటుప్పల్*
*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*
చౌటుప్పల్ పట్టణంలోని చినకొండూర్ రోడ్ సమీపంలోని మసీదు వద్ద 26.07.2025 తేదీన మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో రూ.4,00,000 నగదు చోరీకి గురైన ఘటనపై కేసు నమోదు చేయబడింది.
ఫిర్యాదుదారు వీరగంధం శ్రీనివాస్ తన కారులో ఉంచిన నగదును దుండగుడు శివ అలియాస్ పుల్లారావు అపహరించాడు.
కేసు దర్యాప్తులో భాగంగా, సీఐ మన్మథ కుమార్ నేతృత్వంలో 28.07.2025 ఉదయం ధర్మోజిగూడ గ్రామం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు.
నిందితులు వేముల పుల్లారావు @ శివ, కర్వాల సునీల్ కుమార్, మిద్దే జగదీష్ బాబు లు కాగా, మరో నిందితుడు బతుల సాంబ శివారావు పరారీ ఉన్నాడు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
వీరి వద్ద నుండి రూ.4 లక్షల నగదు, 5 గ్రాముల బంగారు బిస్కెట్, మొబైల్స్, మొబైల్ నంబర్లు, అద్దెకు తీసుకున్న వాహనం మరియు ఇతర పరికరాలు స్వాధీనం చేయబడ్డాయి.
నిందితుల ముందు పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
నిందితులు గతంలోనూ నకిలీ నోట్ల ముఠాలు, నకిలీ బంగారం కేసులలో అరెస్ట్ అయినట్టు విచారణలో వెల్లడైంది.
చోరీ జరిగిన నగదు మొత్తం తిరిగి రికవరీ చేయడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఘటన జరిగిన 24 గంటల లోపే నిందితులను పట్టుకోవడం జరిగింది.
ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ గారు తెలిపారు.
*కనకటి యాదగిరి ఎస్ ఐ* దొంగల వివరాలు తెలియజేసారు
వేముల పుల్లారావు @ శివ ,S/0 లింగయ్య , వయస్సు-38 సంవత్సరాలు, కులం:ముదిరాజ్, R/0: H-No 1-5-862 ,నెహ్రూనగర్,మాచర్ల,పల్నాడు జిల్లా,ఆంద్రప్రదేశ్ రాష్ట్రం
కర్వాల సునీల్ కుమార్ S/o ప్రసాద్ రావు , వయస్సు:45 సంవత్సరాలు, కులం: SC మాదిగ ,వృత్తి : ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ , R/o : 83-122,శరీన్ నగర్,కల్లూరు మండల్,కర్నూల్ జిల్లా
మిద్దె జగదీష్ బాబు S/o దాసు , వయస్సు:46 సంవత్సరాలు, కులం: SC మాల ,వృత్తి : డ్రైవరు , R/o : ఇందిరమ్మ లే ఔట్ కాలనీ,చంద్రపాలెం,పిడుగురాళ్ల టౌన్ & మండలం పల్నాడు జిల్లా.ఆంద్రప్రదేశ్ రాష్ట్రం.N/o నెహ్రూనగర్,మాచర్ల,పల్నాడు జిల్లా,ఆంద్రప్రదేశ్ రాష్ట్రం
Comments