పేదవారి ఆత్మగౌరవనికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.

Rathnakar Darshanala
పేదవారి ఆత్మగౌరవనికి ప్రతీక ఇందిరమ్మ ఇండ్లు.
•ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ...

•పేదవారికి సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం...

•ప్రజాభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం కృషి చేస్తుంది...

•కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు.

నేటి వార్త మల్లాపూర్:మే05:మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ రాఘవపేట ముత్యంపేట సిర్పూర్ నడికుడ గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇంటి కల అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనునిత్యం పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.

 గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం కోసమే ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం అన్నారు గ్రామాలలో జనాభా ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు,

 ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరూ త్వరగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని కోరారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందజేయడంలో పూర్తిగా విప్లమైందన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల వ్యవధిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తున్నామన్నారు.

అన్ని గ్రామాల కు( 109) పత్రాలు పంపిణీ చేశారు.పేదవారు కూడా సన్న బియ్యంతో కడుపునిండా తినాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు,

 గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసి ఒక్క రేషన్ కార్డును కూడా మంజూరు చేయలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 18 నెలల వ్యవధిలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
 కావున ప్రజలందరూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు తోపాటు కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎల్లలా జలపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత -నర్సయ్య,కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు,

 పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసి డైరెక్ట్ లు నుతిపెల్లి రాజాం,ఎండి జామలొద్దీన్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటగిరి ఆనంద్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట సంజీవ్, పోతు శేఖర్, నత్తి రామ్,మీనుగు నరేష్,తదితరులు పాల్గొన్నారు.
Comments