అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మట్టా దంపతుల దిగ్భ్రాంతి.
By
Rathnakar Darshanala
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మట్టా దంపతుల దిగ్భ్రాంతి.
*గుజరాత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు డాక్టర్ మట్టా దయానంద్ దిగ్భ్రాంతి*
నేటి వార్త కల్లూరు డివిజన్ :-
గుజరాత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు డాక్టర్ మట్టా దయానంద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన తన హృదయాన్ని కలిచివేసిందన్నారు.
విమాన ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని భరించే శక్తి బాధిత కుటుంబాలకు లభించాలని ప్రార్థించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments