Tg :మంత్రి ని కలిసిన ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ.
By
Rathnakar Darshanala
Tg :మంత్రి ని కలిసిన ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ.
జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ వికలాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రిగా నూతనంగా ఎన్నికైన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులను తీసుకొన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ శుక్రవారం హైదరాబాదులో మంత్రి నివాస గృహంలో కలిశారు,
రాష్ట్ర మంత్రిగా బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గం నుంచి ఎన్నికైన అట్లూరి లక్ష్మణ్ కుమార్ ని పూల బొకే అందించి అభినందించారు,
ఈ సందర్భంగా కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల అధిరోహించి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర మంత్రి వరకు పదవులు అధిరోహించడం లక్ష్మణ్ కుమార్ కృషి పట్టుదలకు నిదర్శనమని కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు,
రాష్ట్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల శ్రేయస్సుకోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పనిచేస్తామని రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తమ లక్ష్యంగా ముందుకు పోతామన్నారు,
ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని లక్ష్మణ్ కుమార్ ని అభినందించారు,
Comments