పరిష్కారంకు నోచుకోలేని ప్రభుత్వ పాఠశాలలు.
By
Rathnakar Darshanala
పరిష్కారంకు నోచుకోలేని ప్రభుత్వ పాఠశాలలు.
*-బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్*
నేటి వార్త, శేరిలింగంపల్లి:
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినగూడ ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరడంతో,
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారాని తెలుసుకుని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలసి గురువారం పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎన్ని సార్లు పాఠశాలను సందర్శించిన సమస్యలు పరిష్కారం కాకపోడం సిగ్గు చేటు అన్ని అన్నారు. వరద ప్రభావితం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అన్ని అన్నారు. రాష్ట్రంలో గురువారం నుంచి మొదలైన స్కూళ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలతో చెప్తుంటే దానికి భిన్నంగా మదినగూడ లో డ్రైనేజీ నీళ్ల మధ్యల విద్యార్థులు గడపాల్సిన దుస్థితి వచ్చింది అని వారన్నారు.
ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేలుకొని ఇలాంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అన్నారు.
లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బిజెపి నాయకులు సురేష్ కురుమ , కేవీ , కుమార్ , శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments